Gummadi Venkateswara Rao Emotional Words About Mahanati Savitri Last Days. Savitri called me as Annayya says Gummadi
#Mahanati
#Savitri
#GummadiVenkateswaraRao
క్యారెక్టర్ రోల్స్ తో గుమ్మడి వెంకటేశ్వర రావు తిరుగులేని నటన కనబరిచారు. ఎన్నో అద్భుత చిత్రాల్లో ఆయన నటించారు. ఎన్టీఆర్, ఎన్నార్, సావిత్రి వంటి గొప్ప నటులతో ఆ తరువాత తరం నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటుల చిత్రాల్లో కూడా గుమ్మడి నటించారు. ఇటీవల జరిగి ఓ ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గురించి గుమ్మడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం సినీ వర్గాల్లో సావిత్రి గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సావిత్రితో కలసి తాను అనేక చిత్రాల్లో నటించానని గుమ్మడి అన్నారు. సావిత్రి నన్ను అన్నయ్య అని పిలిచేది. సావిత్రి విషయంలో తనకు తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు రెండూ ఉన్నాయని గుమ్మడి అన్నారు.
అవి సావిత్రి చివరి రోజులు. స్టార్ డం బాగా తగ్గిపోయింది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలో ఓ చిత్రంలో సావిత్రికి తల్లి పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంలో నేను కూడా నటించా అని గుమ్మడి అన్నారు.
ఆ చిత్రంలో నటించే సమయంలో భోజనం టైం అయింది. కొంత మంది ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటారు. మిగిలిన వారికి ప్రొడక్షన్ బాయ్ భోజనం తీసుకురావాలి. సావిత్రికి ఇంటినుంచి భోజనం రాలేదు. ఆమె ఒక్కటే ఒంటరిగా కూర్చుని ఉంది. భోజనం చేయలేదా అమ్మ అని అడిగా.. ఆకలిగా లేదు అని సమాధానం ఇవ్వడంతో నాకు పరిస్థితి అర్థం అయిందని గుమ్మడి అన్నారు. భోజయం చేద్దాం రమ్మని పిలిస్తే వద్దని చెప్పింది. నీవు తింటేకానీ నేను కూడా తినను అని చెప్పడంతో కన్నీళ్లు పెట్టుకుని వచ్చింది అని గుమ్మడి అన్నారు.
నటుల జీవితాలకు ఇది ఓ ఉదాహరణ అని గుమ్మడి అన్నారు. అప్పటి వరకు ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి రోజుల్లో స్టార్ స్టేటస్ కోల్పోయింది. దీనితో ఆమెని కనీసం ప్రొడక్షన్ బాయ్ కూడా పట్టించుకోలేదని గుమ్మడి అన్నారు.