Bharti Airtel, Reliance Jio In Slugfest Over Supreme Court Order

2018-05-22 23

Bharti Airtel and Reliance Jio Infocomm on Friday engaged in a fresh slugfest over a Supreme Court verdict relating to the telecom market leader’s Indian Premier League (IPL) multimedia advertising campaign.
#IPL2018
#BCCI
#Cricket
#Airtel
#Hotstar
#Jio

ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్‌టెల్ వినియోగదారులను మోసం చేస్తోందంటూ జియో వాదిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కవరేజీ ప్రకటనలపై ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ సుప్రీం కోర్టుకు తెలిపింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ విధంగా పేర్కొంది.
ఎయిర్‌టెల్‌ ‘లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్' అంటూ ఐపీఎల్‌ కవరేజీపై ఇస్తున్న ప్రకటనల్లోనే దానికి వర్తించే షరతులను కూడా పెద్దవైన అక్షరాల్లో, అందరికీ వెంటనే కనిపించే ప్రదేశంలో ఇవ్వాలని కోరుతూ రిలయన్స్‌ జియో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగానే హైకోర్టు ఆదేశాలు పాటిస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.
ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం ‘సీజన్‌ పాస్‌..' ‘లైవ్‌ అండ్‌ ఫ్రీ యాక్సెస్‌' అంటూ ఐపీఎల్‌ ప్రకటనలు ఇస్తోంది. అయితే మొత్తానికి హాట్‌స్టార్‌ నుంచే ప్రత్యక్ష్య ప్రసారం ఉంటుంది. వీక్షణకు డేటా డౌన్‌లోడ్‌ ఛార్జీలు వర్తిస్తాయి. వీటిని ఎవరికీ కనిపించని విధంగా ప్రచురిస్తూ వినియోగదారులను ఎయిర్‌టెల్‌ మోసగిస్తోందని, తప్పుదోవ పట్టిస్తోందని జియో తొలుత హైకోర్టులో కేసు వేసింది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం ప్రింట్‌ మీడియాలో 12 పిక్సెల్‌ పరిమాణంలో అక్షరాలను ముద్రించాలని, కనిపించేలా ఉండాలని, ప్రకటన కింది భాగంలో ఉండకూడదని మే 2న ఎయిర్‌టెల్‌ను ఆదేశించింది. వీడియో ప్రకటనలో యువతి చెప్పే సీజన్‌ పాస్‌ హై.. అనే వాయిస్‌ తెరపై పడే అక్షరాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది.