Kohli's Reply To Google CEO Sundar Pichai's Tweet

2018-05-21 1

Virat Kohli and AB de Villiers send shivers down the bowlers.When the duo take the centre stage, the fans are treated to Crackers with their exceptional batting.
#Kohli
#DeVilliers
#IPL2018
#RoyalChallengersbangalore

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మ్యాచ్‌ గురించి గూగుల్ సీఈవో స్పందించాడు. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడటం అదృష్టమని పేర్కొన్నాడు. మే 13వ తేదీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడిన బెంగళూరు జట్టు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు 181 పరుగులతోనే ఢిల్లీ జట్టును కట్టడి చేయగలిగింది. అనంతరం చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఇరగదీసి ఆడటంతో 187 పరుగులతో 5 వికెట్లతో విజయం పొందింది.
ఈ మ్యాచ్‌లో ఇరగదీసి ఆడిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 40బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అతనితో పాటు మరో ఎండ్‌లో డివిలియర్స్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ఒకానొక దశలో విరాట్ అవుట్ అయి వెనుదిరగడంతో బాధ్యతనంతా డివిలియర్స్ తీసుకుని జట్టును గెలిపించాడు. ఆ రోజు జరిగిన మ్యాచ్‌తో బెంగళూరు మళ్లీ ప్లేఆఫ్ రేసుకు వచ్చేస్తుందన్న నమ్మకం కలిగింది.
ఆ రోజు సాధారణ అభిమానిగా మ్యాచ్ వీక్షించిన సుందర్ పిచాయ్ డివిలియర్స్, కోహ్లీ ప్రదర్శనలకు ముగ్దుడైయ్యాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. 'అదృష్టం కొద్దీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా.. డివిలియర్స్ ఆట తీరు చాలా చక్కగా అనిపించింది. ఈ సంవత్సరం ఐపీఎల్‌ను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా.' అని ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన కోహ్లీ ఐదు రోజులు ఆలస్యంగా 'థాంక్యూ.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసినందుకు సంతోషంగా భావిస్తున్నాం.' అంటూ బదులిచ్చాడు.
అయితే పిచాయ్ చేసిన ట్వీట్‌కు ఆయన అభిమాని మరొకరు 'పిచాయ్ గారూ.. మీకున్న క్షణం తీరిక లేకుండా గడిపే మీరు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు సమయం ఎలా దొరికింది. అంటూ ప్రశ్నించారు. ఆ ట్వీట్‌కు బదులుగా పిచాయ్ మ్యాచ్ జరుగుతున్న సమయం ఇక్కడ సరిగా శనివారం ఉదయం అందుకే చూడడం కుదిరింది' అని పేర్కొన్నాడు.

Free Traffic Exchange