Hero Vikram,keerthi Suresh Movie Going To Get Released In Telugu

2018-05-19 2

Hero Vikram,keerthi suresh Movie Going To Get Released In Telugu.Saamy 2, the sequel to 2003 super-hit Saamy, will once again have Vikram playing the role of a police officer. Vikram Saamy 2 titled as Saamy Square. Beautiful actresses Keerthi Suresh are going to play the female leads in the movie.

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన చిత్రం సామి స్క్వేర్. విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు హరి ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క తమిళ మోషన్ పోస్టర్ మొన్ననే విడుదలై అనూహ్య స్పందన తెచ్చుకుంది. 2003లో వచ్చిన సామి సినిమాకు ఈ సినిమా సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తమీస్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. హరి-విక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సామి' అప్పట్లో మంచి విజయం సాధించింది. మళ్లీ ఈ కాంబినేషన్‌ రిపీట్ కాబోతుందడంతో ఈ సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ విక్రమ్ ఫాన్స్ అంటున్నారు.
సామి స్క్వేర్ మోషన్ పోస్టర్ ను తెలుగులో కూడ రిలీజ్ చేయనున్నారు. రేపు 20వ తేదీన పోస్టర్ విడుదలకానుంది. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ హరి సినిమాలకి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. అతను దర్శకత్వం వహించిన యముడు, ఆరు, సింగం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. సామి స్క్వేర్ సినిమాని మంచి స్థాయిలో భారీగా విడుదలచేయనున్నారు.