Director Kalyan Krishna Interview On Nela Ticket

2018-05-19 614

Director Kalyan Krishna Interview On Nela Ticket.Director kalyan krishna says he makes films that he'd like to watch them as an audience in theater. Whenever you make a movie, a lot of stakes are involved as the producer and hero's reputation is at stake. Nela ticket coming theaters on may 25.

నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌యిన క‌ల్యాణ్ కృష్ణ‌. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టికెట్టు సినిమా తీయడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ తో ఇంటర్వ్యూ...
నేల టికెట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండబోతోంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్నీగా ఉండబోతోంది. రవితేజ నటన సినిమాకు మరో అదనపు ఆకర్షణ కాబోతోంది.
రవితేజ ఎనర్జీ మాటల్లో చెప్పలేనిది. నేల టికెట్టు సినిమా షూటింగ్ చివరి రోజు సాయంత్రం సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అంత డెడికేషన్ తో రవితేజ వర్క్ చేస్తాడు. మా సినిమాకు ఆయన ఫుల్ ఎఫోర్ట్ పెట్టి చెయ్యడం జరిగింది.
హీరోయిన్ మాళవిక శర్మ నేల టికెట్టు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కొత్త అమ్మాయిలా కాకుండా అనుభవం కలిగిన హీరోయిన్ లా నటించింది. భవిషత్తులో ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం నేల టికెట్టు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాను. ఈ చిత్రం విడుదల తరువాత నాగార్జున సినిమా స్క్రిప్ట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. బంగార్రాజు టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కబోతోంది.
నేల టికెట్టు సినిమా స్టోరి మొదట రాసుకున్నప్పుడు రవితేజ లేడు. తరువాత రవితేజ తో ఈ ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు కథలో కొన్ని మార్పులు చెయ్యడం జరిగింది. తరువాత అనిపించింది ఈ కథకు రవితేజ కరెక్ట్ గా సెట్ అయ్యాడని. ఆయన తప్పా ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు ఈ సినిమాకు.