Actress Rakul Preet Singh Tweets Her wishes

2018-05-19 331

Actress Rakul Preet Singh Tweets Her wishes.Actress Rakul Preet Singh is active in Social media. Always she reacts on incidents base. Rakul recently tweet that Happpy bdayyyy Chakri Anna chaks_makeup !! Have a super duper year !! Lots of happiness.

సినీతారలు తమకు సహాయం చేసే వ్యక్తిగత సిబ్బందిని చాలా ప్రేమగా చూసుకొంటారనేది చాలా సందర్భాల్లో వెల్లడైంది. వ్యక్తిగత సిబ్బంది చూపించే ప్రేమానురాగాలతో సినీ తారలు చాలా కంఫర్ట్‌గా ఉంటారు. ఎటువెళ్లినా వారు తోడు ఉంటారు కాబట్టి.. తమ సిబ్బందిని నటీనటులు బాగా నమ్ముతారు. తనకు మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించే చక్రిపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అభిమానాన్ని చాటుకొన్నారు.మేకప్ మ్యాన్ చక్రీ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు రకుల్. చక్రీ అన్న హ్యాపీ బర్త్ డే. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి. సుఖ:సంతోషాలతో ఉండాలి అని రకుల్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో రూపొందే సినిమాల్లో చాలా బిజీగా మారారు. అజయ్ దేవగన్, టబూతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో కార్తీతో కలిసి ఓ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నారు