Niharika Sensational Comments on Chiranjeevi, Pawan Kalyan

2018-05-19 2,206

Niharika about Chiranjeevi and Pawan Kalyan. I dont want Mega princess tag says Niharika

మెగా ప్రిన్సెస్ నిహారిక ఆ ఫ్యామిలీలోనే చలాకి అమ్మాయి. ఒక మనసు చిత్రంతో నిహారిక నటిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కొణిదెల వారి అమ్మాయి నిహారిక తెలుగు తమిళ భాషల్లో నటిస్తోంది. ఎప్పుడూ చలాకీగా ఉండడం, నవ్వించేలా మాట్లాడుతుండడంతో నిహారికకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక మెగా ఫ్యామిలిలో ఒక్కో వ్యక్తి ప్రత్యేకతని వివరించింది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, పవన్ కళ్యాణ్ ఇలా అందరిలో తాను గమనించిన విషయాలని వెల్లడించింది.
నిహారిక హీరోయిన్ గా మారక ముందు నుంచే టీవీ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులు నిహారికని మెగా ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించేశారు. తనకు మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ వద్దని అంటోంది.
చిరంజీవి గారిలో తాను నేర్చుకున్న విషయం కష్టపడడం అని నిహారిక తెలిపింది. ఓవర్ నైట్ లో ఏది సొంతం కాదని కష్టపడితేనే సాధ్యం అని నిహారిక తెలిపింది. నాన్న నాగబాబు గారి నుంచి కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా అని నిహారిక తెలిపింది.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చుట్టూ మ్యాజికల్ ఒరా ఉందని నిహారిక తెలిపింది. ఆయన నడచి వస్తుంటే ఆయన చుట్టూ ఒరా ఉన్నట్లు అర్థం అవుతుందని దానిని మాటల్లో చెప్పలేం అంటూ నిహారిక తెలిపింది. అందులో కొంతైనా లాగేసుకోవాలని ఉన్నట్లు నిహారిక తెలిపింది.