Sri Reddy Protest On Road At Prakasam District

2018-05-19 1,736

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా తారలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దికాలంగా టాలీవుడ్ ప్రముఖులపై ఫైర్ అవుతున్న శ్రీరెడ్డి తాజాగా వినూత్న నిరసన తెలిపి ఆకట్టుకొన్నారు. ఈ సారి ఆమె చెప్పట్టిన నిరసనపై సోషల్ మీడియాలో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మల్లికార్జున‌స్వామిని దర్శించుకొనేందుకు శ్రీరెడ్డి శ్రీశైలం ప్రయాణం అయ్యారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి సమీపంలో ఉపాధి కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో కారు ఆపి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. తమకు ఉపాధి పనులు కల్పించడం లేదని ఈ సందర్భంగా కూలీలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.
కూలీల బాధలు తెలుసుకొని వెంటనే స్పందించారు. వారితో కలిసి కొంతసేపు రోడ్డుపై తనదైన శైలిలో నిరసన తెలిపారు. దారినపోయే వాహనాదారులందరూ శ్రీరెడ్డిని చూసి ఆగిపోయారు. దాంతో రోడ్డుపై కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
శ్రీరెడ్డి చేసిన నిరసన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఉపాధి కూలీలకు సమస్యలపై స్పందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో కొంత హాడావిడి చేశారు. స్థానికులతో కాసేపు మాట్లాడి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు.
ఇదిలా ఉండగా, తన ఇంటర్వ్యూ తీసుకొన్న దుబాయ్ ప్రతిక ఖలీజ్ టైమ్స్‌కు, అవుట్ లుక్ మ్యాగజైన్‌కు, బిజినెస్ స్టాండర్డ్ మ్యాగజైన్‌కు శ్రీరెడ్డి థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు కొందరు సినీ ప్రముఖులకు చురకలు అంటించారు. స్థానిక మీడియాను మీరు కొనొచ్చు. కానీ జాతీయ, అంతర్జాతీయ మీడియాను కొనగలరా? అని ప్రశ్నించారు.