Congress party made all arrangements to shift their MLA's from Hyderabad to Bengaluru, for this they made three alternate plans
#KarnatakaAssemblyElections2018
#Congress
#JDS
#BJP
#Siddaramaiah
#Kumaraswamy
కర్ణాటక రాజకీయాలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం 4.30కి యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష ఉండటంతో.. ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వందకు నూటా ఒక్క శాతం తమదే విజయమని యడ్యూరప్ప చెబుతున్న మాటలే నిజమవుతాయా?.. లేక బలనిరూపణలో ఆ పార్టీ తేలిపోతుందా? అన్నది వేచి చూడాలి.
బలనిరూపణకు ఇంకా కొద్ది గంటలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు పకడ్బంధీ ప్లాన్ వేస్తున్నాయి. ఎమ్మెల్యేల తరలింపు కోసం మూడు ప్లాన్లను సిద్దం చేసినట్టు తెలుస్తోంది.
ప్లాన్-1:
ఏ క్షణమైనా ఎమ్మెల్యేలను తరలించడానికి రెండు ప్రత్యేక విమానాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి. ప్రత్యేక విమానాలు కాబట్టి గంటన్నరలో ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకోనున్నారు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ ప్రత్యేక విమానాన్ని నిరాకరించడంతో.. అలాంటి పరిస్థితి ఏమైనా తలెత్తితే వెంటనే ప్లాన్-2ను అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ప్లాన్-2:
ప్రత్యేక విమానాలకు అనుమతి నిరాకరిస్తే.. ఎమ్మెల్యేలను బస్సుల ద్వారా బెంగళూరుకి తరలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం 4 ఏసీ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. బస్సుల్లో అయితే బెంగళూరుకు 8గం. సమయం పట్టనుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ ఏపీ మీదుగా ఎమ్మెల్యేలను బెంగళూరును తరలించనున్నారు.