Ram Charan About Upasana With Manchu Lakshmi

2018-05-18 595

Ram Charan About Upasana With Manchu Lakshmi .Ram Charan about Upasana. Me and Upasana wedding is best thing in my life says Ram Charan
#RamCharan
#ManchuLakshmi

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. రంగస్థలం చిత్రం విజయం సాధించిన వెంటనే బోయపాటి చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ముగిసిన వెంటనే రాజమౌళితో భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు రాంచరణ్. ఇటీవల మంచి లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమంలో రాంచరణ్ పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రాం వలన మంచు లక్ష్మి చారిటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి, రాంచరణ్ మధ్య సరదా సంభాషణ జరిగింది.
కమర్షియల్ చిత్రాలతోనే కొత్తగా ట్రై చేయాలనీ ప్రయత్నిస్తున్న తరుణంలో సుకుమార్ రంగస్థలం కథతో వచ్చారని రాంచరణ్ అన్నారు. 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి ఇంటెలిజెంట్ కథలు చెబుతాడేమో అని అనుకున్నట్లు చరణ్ తెలిపాడు.
చెప్పబోయే కథ పూర్తి వైవిధ్యంతో కూడుకున్నది అని సుకుమార్ చెప్పగానే ఆసక్తిగా విన్నానని చరణ్ తెలిపాడు. వినికిడి లోపం ఉన్న పాత్ర అని చెప్పగానే మీ ఫాన్స్ ఒప్పుకుంటారా లేదో అనే భయం వేయలేదా అని మంచు లక్ష్మి అడిగింది. బయపడలేదు అని అంటే అబద్దమే.. భయపడ్డాను.. కానీ సుకుమార్ వివరించిన కథతో కన్విన్స్ అయ్యానని చరణ్ తెలిపాడు.
రాంచరణ్ తో సాగిన సరదా సంభాషణలో మంచు లక్ష్మి ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. పెళ్ళైన తరువాత మీలో వచ్చిన మార్పు ఏంటి అని రాంచరణ్ ని ప్రశ్నించింది. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా.. నువ్వే చెప్పు అంటూ రాంచరణ్ లక్ష్మితో అన్నాడు.
పెళ్లయ్యాక రాంచరణ్ బాగా కూల్ గా మారిపోయాడు అని లక్ష్మి తెలిపింది. దీనికి సరదాగా స్పందించిన రాంచరణ్.. అంటే ఉప్సి నా గాలి మొత్తం తీసేసిందా అంటూ వ్యాఖ్యానించాడు. ఉపాసనని పెళ్లి చేసుకోవడం తన జరిగిన బెస్ట్ మూమెంట్ అని రాంచరణ్ తెలిపాడు.