తాజ్ లో కాంగ్రెస్ MLAలు అసలు ఏం జరుగుతుంది??

2018-05-18 302

karnataka mlas bus tour came to hyderabad and went to taj krishna. jds mla's are kept in hotel novotel in shamshabad.telangana pcc chief uttam kumar reddy, madhu yashki welcome them. in the evening congres senior leader gulam nabi azad will discuss with karnataka mla's as wel as jds mla's.
#KarnatakaMLAs
#JDSMLAs
#TajKrishna
#Azad
#UttamKumarReddy

హైదరాబాద్ తాజ్ క్రిష్ణ హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తాజ్ హోటల్ పరిసరాలు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాయి. అకస్మాత్తుగా పోలీసులు మొహరించడం, మీడియా హడావిడి మొదలు కావడంతో ఏం జరుగురుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కొక్కటిగా కర్ణాటక బస్సులు ఎమ్మెల్యేలతో హొటల్ లో కి చేరుకోవడంతో పరిస్థితులు అర్థం అయ్యాయి.
మొదట బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ కు కర్ణాటక ఎమ్మెల్యేలు చేరుకుంటారని సమాచారం వచ్చినా అది మీడియాను ఏమార్చడానికేనని తెలిసిపోయింది. తర్వాత తాజ్ క్రిష్ణ కి చేరుకున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలు కర్ణాటక ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. సీనియర్ నేతలు మధు యాష్కి, పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, ఎంఎల్యే సంపత్, జగ్గారెడ్డి తదితర నేతలు కర్ణాటక ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు మండి పడ్డారు. గోవా, నాగాలాండ్, మణిపూర్ లలో ఒక విధానం, కర్ణాటకలో మరో విధానాన్ని ఎలా అమలు చేస్తారని బీజేపి నేతలపైన మండిపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ విలువలను కాపాడాలి గాని, బీజేపి ప్రయోజనాలను కాదని మదుయాష్కి అన్నారు.
సరైన సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పడం ఫిరాయింపులను ప్రోత్సహించేందుకేనని తెలిపారు. కర్ణాటక ఎమ్మెల్యేలతో పార్టీ సీనియర్ నే గులాం నబీ ఆజాద్, సిద్ద రామయ్య చర్చలు జరపబోతున్నారు. తాజ్ క్రిష్ణలో బస చేసిన ఎమ్మెల్యేలు ఇదే రోజు రాత్రికి తిరిగి కర్ణాటక వెళ్లనున్నారు.