IPL 2018: AB de Villiers Becomes 'Superman' Near Boundary

2018-05-18 178

You would not want to draw Sunrisers Hyderabad in a must-win game because of their immense bowling might. But that's the task Royal Challengers Bangalore had in front of them and they survived the test in a riveting contest, emerging a 14-run winner at the M Chinnaswamy Stadium here on Thursday (May 17).
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad
#IPL2018
#ABDeVeilliers
#Kohli

ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సూపర్‌ మ్యాన్‌ను తలపించాడు. గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన క్యాచ్‌తో అలెక్స్ హేల్స్‌ను పెవిలియన్ చేర్చాడు.
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బౌలర్‌ మొయిన్‌ అలీ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఆఖరి బంతిని అలెక్స్‌ హేల్స్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డివిలియర్స్‌ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క‍్రమంలోనే బౌండరీ లైన్‌ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది. డివిలియర్స్ ఒంటి చేత్తో అంత ఎత్తు ఎగిరి మరీ పట్టిన క్యాచ్ పట్ల ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏబీని సూపర్ మ్యాన్‌తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు స్పైడర్‌ మ్యాన్‌ను లైవ్‌లో చూశానంటూ ఏబీ క్యాచ్ అందుకుంటున్న ఫొటోను కోహ్లీ ట్వీట్ చేశాడు.
మ్యాచ్ అనంతరం ఏబీ డివిలియర్స్ సూపర్ మ్యాన్ క్యాచ్‌పై కోహ్లీ మాట్లాడుతూ 'అది ఒక స్పైడర్‌మన్‌ స్టఫ్‌. అలా ఎవరు అనుకరించకండి. అది కచ్చితంగా సిక్స్‌ అని నేను భావించా. కానీ ఏబీ అద్భుతంగా అందుకున్నాడు. అతని ఫీల్డింగ్‌ను నేను అనుకరిస్తున్నాను. హోంగ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు మద్దతు తెలిపిన అభిమానులందరికి కృతజ్ఞతలు' అని అన్నాడు