Basil Thampi's return to SRH's playing XI against RCB proved to be nightmarish as he conceded 70 runs in his four overs without a wicket, most expensive figures in the history of the IPL.
#SunrisersHyderabad
#BasilThampi
#IPL2018
#RoyalChallengersbangalore
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ బసిల్ థంపి ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని విభాగాల్లో తేలిపోయింది.
గత సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు అందుకున్న థంపి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లు వేసిన థంపి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు.
గురువారం రాత్రి భువీ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న థంపి.. తాను వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్‌లో ఇప్పటికి వరకు ఇషాంత్ శర్మ పేరు మీదున్న ఈ చెత్తరికార్డును థంపి బద్దలు కొట్టాడు. 2013లో జరిగిన ఐపీఎల్‌లో ఇషాంత్ శర్మ మొత్తం 66 పరుగులిచ్చాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఇదే అత్యధికం కాగా ఇప్పుడు థంపి ఆ రికార్డుని అధిగమించాడు. ఇషాంత్ శర్మ తర్వాత ఉమేశ్ యాదవ్ (0/65), సందీప్ శర్మ(1/65), వరుణ్ ఆరోన్ (2/63), అశోక్ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.