IPL 2018: RCB vs SRH Match Preview

2018-05-17 97

Royal Challengers Bangalore (RCB) will face Sunrisers Hyderabad at the M Chinnaswamy stadium here on Thursday (May 17). Mykhel gives you the significance of the match - more for Royal Challlengers than Sunrisers.
#IPL2018
#Kohli
#KaneWilliamson
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లలో సన్‌రైజర్స్ అన్నివిధాల పైచేయిగానే ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో తొమ్మిదింట్లో విజయం సాధించి, మరో మూడింట్లో ఓటమిపాలైంది.
18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడి ఐదింట విజయం సాధించి, మరో ఏడింట్లో ఓటమి పాలైంది. దీంతో 10 పాయింట్లలో పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలొ ఉంది.
మే 12న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచిన బెంగళూరు, 14న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. వరుస వైఫల్యాలతో అవస్థలు పడుతున్న బెంగళూరు జట్టుకు ఢిల్లీ, పంజాబ్‌లపై వరుస విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
ఇదే ఊపుతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్‌లో కోహ్లీతోపాటు డివిలియర్స్ కలిపి మొత్తం బెంగళూరు జట్టు సభ్యులంతా కలసి సాధించిన పరుగుల్లో దాదాపు సగం పరుగులు (కోహ్లీ 514, డివిలియర్స్ 358) సాధించారు. మిడిలార్డర్‌లో అలీ, ఆండర్సన్ లాంటి వారు పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు.
ఇక, బౌలింగ్ విషయానికి వస్తే బెంగళూరు జట్టు ఎక్కువగా ఉమేష్ యాదవ్ పైనే ఆధారపడుతోంది. ఈ సీజన్‌లో ఉమేశ్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ విజృంభిస్తే ఆ జట్టుకు తిరుగుండదు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మూడు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మరో ఏడు మ్యాచ్‌లలో వరుస విజయాలతో దూసుకుపోయింది. మే 13న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.