Rakul Preeth Singh Comments About Surya

2018-05-17 1,054

Rakul Preet Singh is an Indian film actress and model who predominantly works in the Telugu film industry. in telugu she did so meny films with top heros. her latest film with surya. Suriya's much-awaited film with Selvaraghavan will have two heroines. One is Rakul Preet Singh and another one is sai pallavi. In a latest interview rajul tells some intresting facts about suriya. Rakul's last film in Tamil, Theeran Adhigaram Ondru, was with Suriya's brother Karthi.
#RakulPreetSingh

సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకేక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. దీపావ‌ళికి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సూర్య గురించి హీరోయిన్ రకుల్ మాట్లాడడం జరిగింది.
చాలా మంది టాప్ హీరోస్ తో రకుల్ వర్క్ చేసినప్పటికీ మొదటిసారి సూర్య గురించి మాట్లాడడం జరిగింది.
ఇంతకీ రకుల్ సూర్య గురించి ఏమనిందంటే... ''సూర్య అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడ ఎలాంటి యాటిట్యూడ్ చూపించడు, చాలా సాధారణ మనిషిలా ప్రవర్తిస్తాడు. సెట్స్ లో సమయానికి ఉంటారని, అందరితోను చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారని, నేను చూసిన హీరోల్లో ఆయనొక పర్ఫెక్ట్ జెంటిల్మెన్'' అని అన్నారు.
సూర్య తమ్ముడు కార్తీకి జంటగా రకుల్ నటించిన 'ఖాకీ' సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరో జగపతిబాబు ఓ విలన్ పాత్రను పోషిస్తున్నారట. సూర్య, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు హోరా హోరిగా ఉండబోతున్నాయని సమాచారం.