R V Deshpande To Be Pro-Tem Speaker In Karnataka Legislative Assembly

2018-05-17 439

B S Yeddyurappa has been sworn in as the Chief Minister of Karnataka. The focus now shifts to the floor of the Karnataka Legislative Assembly where the BJP will have to prove it has a majority. All this would however be subject to the result of the writ petition that is pending before the Supreme Court which will be heard today.
#KarnatakaElectionResults2018
#Modi
#AmitShah
#JDS

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి 104 మంది శాసన సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ప్రభుత్వాన్ని బలపరీక్షలో నిలబెట్టుకోవాల్సి ఉంది. అయితే బీఎస్. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవడానికి శాసన సభలో స్పీకర్ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తాత్కాలిక స్పీకర్ ఎవరు ? ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారా అనే చర్చ ఇప్పుడు మొదలైయ్యింది.
కర్ణాటక శాసన సభ సమావేశం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మెజారిటీ శాసన సభ్యుల మద్దతు చూపించాలి. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఎస్. యడ్యూరప్ప అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే సమయంలో స్పీకర్ కీలక పాత్రపోషిస్తారు. ప్రస్తుతానికి కర్ణాటకకు స్పీకర్ ఎవరూ లేరు. కర్ణాటకకు తాత్కాలిక స్పీకర్ ను ఏర్పాటు చేసిన తరువాత బీఎస్ యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంటుంది.
సీఎంగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చెయ్యడం సవ్వంగానే జరిగిపోయినా ఇప్పుడు కర్ణాటక తాత్కాలిక స్పీకర్ బీజేపీకి సహకరిస్తారా అనే ప్రశ్న మొదలైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ శాసన సభ్యులు అందరూ కలిసి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
కర్ణాటక తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయంపై ఇప్పుడు తారాస్థాయిలో చర్చజరిగింది. కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా ఎవర్ని నియమించాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గవర్నర్ కు లిఖితపూర్వకంగా లేఖ రాసి తాత్కాలిక స్పీకర్ నియమకానికి అనుమతి తీసుకోవాలి.