కర్ణాటక రాజకీయ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినట్లు కనిపిస్తోంది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ శాసనసభపక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు.
బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి.
గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అయితే, అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించడంలో ఎలాంటి తప్పూ లేదని, ఆ ప్రక్రియను అడ్డుకోవడం కుదరని స్పష్టం చేసింది.
దీంతో యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లయింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్‌టన్ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. బలనిరూపణ పరీక్ష వరకు ఎమ్మెల్యేలను ఇక్కడే ఉంచనున్నారు. అంతేగాక, ఎమ్మెల్యేల ఫోన్లను కూడా తీసుకున్నాయి కాంగ్రెస్, జేడీఎస్.
In a dramatic late night development, a three-judge bench of the Supreme Court is hearing the petition filed by the Congress and the JD(S) challenging Karnataka Governor Vajubhai Vala's decision to invite the BJP to form the government in the southern state.