Hosts Mumbai Indians will fancy beating a floundering Kings XI Punjab when both sides face-off in a must-win match in the Indian Premier League (IPL) here on Wednesday (May 16). After a string of losses initially, Mumbai's hopes of making it to the last four were revived after three straight wins, but their eight-wicket defeat against Rajasthan Royals on Sunday (May 13) has again put them on the back foot.
ఐపీఎల్‌లో భాగంగా సొంత గడ్డపై మ్యాచ్ ఆడి కచ్చితంగా గెలిచి తీరాలనే బలమైన సంకల్పంతో ముంబై ఇండియన్స్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇంతకుముందు ముంబై ఆడిన ఆఖరి 4 మ్యాచ్‌లలో మూడు వరుస విజయాల అనంతరం ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం పొందింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో గెలుస్తుందనుకున్న అంచనాలు తారుమారవడంతో ఓటమికి గురికావాల్సి వచ్చింది.
లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లలో ఇరు జట్లు 12 మ్యాచ్‌ల వరకూ ఆడాయి. ముంబై ఆరో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్ ఐదో స్థానంలో రాణిస్తోంది. ఈ మ్యాచ్ లో అసాధారణ విజయం సాధించి రాయల్స్ జట్టును వెనుకపడేస్తే తప్ప ముంబైకి ప్లేఆఫ్ రేసులో చోటు దక్కదు. ఎందుకంటే పంజాబ్, రాయల్స్ పాయింట్లలో పెద్దగా వ్యత్యాసంతో లేరు. పంజాబ్ కంటే ముందున్న రాయల్స్‌ను టార్గెట్ చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశముంది.
పంజాబ్ కు మాత్రం కోలుకోవడానికి వీలు లేకుండా పోతోంది. వరుస వైఫల్యాలతో ఆ జట్టు ఇప్పటికే నీరుగారిపోయింది. మిడిలార్డర్ వైఫల్యంతో కొనసాగుతోన్న జట్టు బౌలింగ్ పరవాలేదనిపించుకున్న బ్యాటింగ్ విభాగంలో మరింత బలహీనంగా కనిపిస్తోంది.
వాంఖడే వేదికగా తలపడనున్న ఇరు జట్లు విజయం కోసం ఆతురతతో పోరాడుతుండటంతో మ్యాచ్ పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.