Anasuya Birthday Celebrations 2018. Anasuya Bharadwaj is an Indian television presenter and actress. After working as a news presenter Bharadwaj appeared as a TV anchor on Jabardasth, a comedy show. The show elevated her career. After this, she got an opportunity to act in film opposite Akkineni Nagarjuna in Soggade Chinni Nayana. Later, in the same year, she made her debut with Kshanam in which she portrayed a negative lead role.
#Anasuya
#AkkineniNagarjuna
యాంకర్ అనసూయ.... ఇపుడు ఇలా పిలిస్తే ఆమె అభిమానులు ఒప్పుకోరేమో? ఎందుకంటే ఆమె ఆ స్థాయిని దాటి తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటిగా ఎదుగుతోంది. ఇటీవల విడుదలైన 'రంగస్థలం' తర్వాత అనసూయ రేంజి మరింత పెరిగింని చెప్పక తప్పదు. ఇందులో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా విడుదలై చాలా రోజులైంది కదా... ఇపుడు అనసూయ ప్రస్తావన ఎందుకు... అనుకుంటున్నారా? ఇందుకు కారణం అనసూయ పుట్టినరోజు వేడుక. మంగళవారం ఈ హాట్ యాంకర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరుపుకుంది.
అనసూయకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేధికల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె బర్త్ డే సందర్భంగా అభిమానులో కామెంట్లతో ముంచెత్తారు. ఆమె ఫోటోలను షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బుల్లితెర ప్రపంచంలో అతి తక్కువ కాలంలో సంచలనం అయిన వారిలో అనసూయను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.అనసూయ కెరీర్ మలుపు తిప్పిన కార్యక్రమం 'జబర్దస్త్' కామెడీ షో. ఈ షో తర్వాత అనసూయ పాపులారిటీ మరింత పెరిగింది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంటూ టాప్ హీరోల సినిమా పంక్షన్లను హోస్ట్ చేసే స్థాయికి ఎదిగారు.
చిలిపి చేష్టలు, ముద్దొచ్చే హావభావాలు, ఆకట్టుకునే యాంకరింగ్ స్కిల్స్ అనసూయ ప్లస్ పాయింట్స్. అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లకు భిన్నమైన శైలి ప్రదర్శించడం, ప్రేక్షకులకు ఆమె తెగనచ్చేయడంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.