Apple biggest company is making a sensational decision. Decided to enter the banking sector.
#AppleCreditCard
#MasterCard
#VisaCard
అతి పెద్ద IT దిగ్గజ సంస్థ యాపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకొంది. బ్యాంకింగ్ రంగంలోకి ఎంటర్ కావాలి అని నిర్ణయించుకొంది.
అందులో భాగంగా యాపిల్ క్రెడిట్ కార్డు విడుదల చేయబోతోంది. 2019 మార్చి కాంత ప్రజల చేతిలో ఈ యాపిల్ క్రెడిట్ కార్డు పెట్టాలి అని అనుకుంటోంది. అందుకుగాను ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్ మెన్ సంస్థతో ఒప్పందం చేసుకోబోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో మాస్టర్ కార్డు వీసా కార్డు దొరుకుంటున్నాయి. ఇవి రెండు కార్డులు అమెరికా సంస్థలకి సంబంధించినవే. కానీ ఇప్పుడు యాపిల్ కూడా ఈ రంగంలోకి వస్తుండటంతో వీటి మధ్య పోటీ బాగా ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెడిట్ కార్డ్స్ వాటి ఆఫర్స్ కన్నా మరిన్ని ఆఫర్లుతో యాపిల్ మార్కెట్లోకి రావాలని ఉంది. క్రెడిట్ కార్డులు ద్వారా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులని పెంచుకోవాలని అనుకుంటోంది.
ఈ యాపిల్ క్రెడిట్ కార్డు ద్వారా కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, వాచీలు, ఐ ఫోన్లు , ఇలా యాపిల్ కంపెనీ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటికి ఎలాంటి వడ్డీ లేని రుణం ఇవ్వడంతో పాటు మరింత డిస్కౌంట్ ఇచ్చేలాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాపిల్ కంపెనీకి క్రెడిట్ కార్డు వ్యాపారం కొత్త కాదు అంటున్నారు మార్కెట్ వర్గాలు ఇప్పటికే బ్యారెల్ బ్యాంకు క్రెడిట్ కార్డులను యాపిల్ సంస్థ అందిస్తోంది. ఇప్పుడు మాత్రం సొంతంగా యాపిల్ క్రెడిట్ కార్డు విడుదల చేస్తోంది.