We all know that Sonam Kapoor is quite a fashionista who never shies away from experimenting with her wardrobe. In fact in the past, the actress has even pulled off many unconventional looks with confidence and ease. And when it comes to Cannes red carpet appearances, the actress has given us some memorable moments to cherish.
#Cannesredcarpet
#SonamKapoor
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఇటీవల ఆనంద్ ఆహుజాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే అమ్మడు కేన్స్ ఫెస్టివల్‌లో వాలిపోయారు. తొలి రోజు రెడ్ కార్పెట్ వేడుకలో తన వస్త్రధారణతో పెద్దగా ఆకట్టుకోలేని సోనమ్... రెండో రోజు అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. తన శరీర రంగుతో మ్యాచ్ అయ్యే న్యూడ్ కలర్ గౌనులో దర్శనమిచ్చి అందరి మతి పోగొట్టారు. సోనమ్ ఈ డ్రెస్సులో మరింత హాట్‌గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సోనమ్ కపూర్ ధరించిన ఈ గౌను... క్రిస్టియన్ సాంప్రదాయపు వివాహాల్లో పెళ్లి కూతురు ధరించే గౌనులా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
లూజ్ బన్ హెయిర్ స్టైల్, కను రెప్పలపై ఎల్లో కలర్ ఫినిషింగ్, దొండపండు లాంటి ఎరుపెక్కిన పెదాలతో సోనమ్ కపూర్ ఏంజిల్‌లా దర్శనమిచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగం కావడాన్ని తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తానని, మరోసారి ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన సోనమ్ కపూర్ తెలిపారు.
ఉదయం 6 గంటలకే కేన్స్‌లో తన రోజు మొదలైందని, చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు సోనమ్ వెల్లడించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సోనమ్ కపూర్. ఎల్ ఓరియల్ అనే కాస్పొటిక్ బ్రాండ్ తరుపున ప్రచారం చేస్తున్న సోమన్ ఆ సంస్థ తరుపున ఈ వేడుకకు హాజరయ్యారు.