Around 30 Feared Drowned as Boat Capsizes in Godavari River

2018-05-16 1

36 people went missing after a boat capsized in Godavari River in Andhra Pradesh on Tuesday, officials said.The incident occurred near Manturu in Devipatnam block of East Godavari district around 5 p.m.
#Boat
#AndhraPradesh
#GodavariRiver
#Tourists

పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ప్రాంతాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఈ పడవ మునిగిపోయి ఉందని అధికారులు తెలిపారు. ఈ పడవను బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ మునిగిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సుమారు 36 మంది ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. సుమారు 50 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.
లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నేవీ అధికారులు, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు.
ఉభయగోదావరి జిల్లాల మధ్యలో లాంచీ మునిగిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. లాంచీని గోదావరి నది నుండి బయలకు తీసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. భారీ క్రేన్ల సహయంతో లాంచీని నది నుండి బయటకు లాగేందుకు ప్రయత్నాలను బుధవారం నాడు ఉదయం ప్రారంభించారు. లాంచీని నది నుండి వెలికి తీస్తే గల్లంతైన వారి విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మంగళవారం నాడు వాతావరణంలో మార్పుల గురించిన సమాచారం లాంచీ సిబ్బందికి అందించలేకపోయినట్టు కలెక్టర్ తెలిపారు.ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈదురుగాలుల కారణంగానే లాంచీ ప్రమాదానికి గురైందని కలెక్టర్ తెలిపారు. అయితే ఈదురుగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని లాంచీ సిబ్బందికి సమాచారం ఇచ్చేసరికి అప్పటికే లాంచీ నదిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ సమాచారం లాంచీ సిబ్బందికి చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లాంచీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గాలింపుతో పాటు సహయక చర్యల గురించి బాబు ఆరా తీశారు. గాలింపును ముమ్మరం చేయాలని బాబు అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి కొద్దిసేపట్లో బాబు చేరుకోనున్నారు. మృతదేహల దేహల వెలికితీతతో పాటు అవసరమైతే భారీ క్రేన్లను కూడ తెప్పించాలని బాబు అధికారులను ఆదేశించారు.