Counting of votes for the Karnataka Assembly elections began this morning, in what is expected to be a nail biting finish, with most of the exit polls predicting a hung assembly.
#KarnatakaAssemblyElections2018
#Siddaramaiah
#Yedyurappa
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడికానున్నాయి. వేగంగా ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నామని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బెంగుళూరులో మొత్తం 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.ప్రతి రౌండ్ పూర్తైన తర్వాత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఆ సమాచారాన్ని పొందుపరుస్తున్నామని ఆయన ప్రకటించారు.
మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.సాయంత్రానికి స్పష్టమైన వివరాలను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి రెండు సీట్లకు ఎన్నికలు జరగలేదు.
రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెలాఖరున పోలింగ్ నిర్వహించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధి మృతి చెందిన కారణంగా ఒక అసెంబ్లీ స్థానంలో ఎన్నికను వాయిదా వేశారు. బోగస్ ఓటరు ఐడీ కార్డులను గుర్తించిన నేపథ్యంలో మరో అసెంబ్లీ స్థానంలో ఎన్నికను వాయిదా వేశారు. ఈ రెండు సెగ్మెంట్లు మినహా మిగిలిన చోట్ల మే 12 ఎన్నికలు జరిగాయి.