ఏటీఎంకు వెళ్లి దుస్తులు మార్చుకున్న యువతి

2018-05-14 235

It is said that A drunken and drive girl changed shirt in ATM centre to avoid Police in Hyderabad.
#DrunkandDrive
#Hyderabad
#Youth

పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అర్ధరాత్రి ఓ నటుడు దొరికిపోయాడు. మరో యువతి కూడా మద్యం మత్తులో ఉండి.. పోలీసులు కారు ఆపగానే చాకచక్యంగా వెంటనే కారు దిగి ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి షర్ట్ మార్చుకుంది. తద్వారా ఆమె తప్పించుకుంది.
పోలీసులు నిత్యం డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి రాత్రి నిర్వహించిన తనిఖీల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు నెంబర్ 10లో నిర్వహించిన తనిఖీలో ఉయ్యాలా జంపాలా ఫేమ్‌ కిరీటి దామరాజు మద్యం తాగి కారు నడుపుతుండగా పోలీసులు నిలువరించి, అతనికి శ్వాసపరీక్షలు చేశారు.
రక్తంలో ఆల్కహాల్‌ లెవెల్‌ 36గా రావడంతో కారును స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45 ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సిబ్బందికి మద్యం మత్తులో కారు నడుపుతున్న యువతి తప్పించుకుంది.
పోలీసులు కారు ఆపారు. ఆమె వెంటనే కారు దిగి సమీపంలోని ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి టీ షర్టు మార్చుకుంది. వేరేవాళ్లు కారు నడిపారంటూ బుకాయించింది. పోలీసులు నిర్ధారించలేక వదిలేశారు. పలువురు వాహనదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.