Tamil film producers meeting against TFPC president Vishal. In a reference to actor Vishal’s Telugu ancestry, director Bharathiraja said that only a Tamilian should head the TFPC. “It's been nearly 14 months since Vishal was elected to the TFPC. But he has not delivered on any of his promises.
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, నటుడు విశాల్ మీద ఆయన వ్యతిరేక వర్గం విరుచుకుపడింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పై** అరికట్టడంలో ఫెయిలయ్యాడని, వెంటనే ఆయన ఈ పదవి నుండి తప్పుకోవాలనే డిమాండ్ చేశారు.
విశాల్ వ్యతిరేక వర్గంగా పేరొందిన ప్రముఖ దర్శకుడు భారతీ రాజా, నటుడు టి రాజేందర్, జెకె రితేష్, మరికొందరు తమిళ సినీ నిర్మాతలు ఆదివారం చెన్నైలో సమావేశం అయ్యారు. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ సాధించింది ఏమీ లేదని, పై** అరికడతాననే హామీతో పాటు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడని ఆరోపించారు.
ఇటీవల ఓ తమిళ వెబ్ సైట్ మీద ఆరోపణలు చేస్తూ ఓ కథనం వెలువరించింది. దాదాపు 40 పై** వెబ్ సైట్ల వెనక ‘** ప్రొడక్షన్స్' హస్తం ఉందని తన కథనం సారాంశం. ఈ విషయం ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా విశాల్ తెలుసుకున్నాడని, ** ప్రొడక్షన్స్‌ను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నాడని, అందులో భాగంగానే ఆ సంస్థ విశాల్ తాజా సినిమా ఇరుంబు తిరై చిత్రాన్ని నిర్మించిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు వెబ్ సైట్ కథనం వెలువరించింది.
ఈ మధ్య కాలంలో విశాల్ అసలు సినిమాలేవీ నిర్మించడం లేదని, అలాంటపుడు విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అంటూ మీడియా సమావేశంలో నిర్మాత కె రాజన్ ప్రశ్నించారు.
తమిళ సినీ ఇండస్ట్రీలో విశాల్ ఇష్టా రాజ్యం నడుస్తోందని, అతడి చర్యల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయని మరో నిర్మాత తిరుమలై ఆరోపించారు. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై' చిత్రాన్ని ** వారు నిర్మించారు, దీన్ని 300 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు, అయితే విశాల్ మాత్రం 220 థియేటర్లలో మాత్రమే తన సినిమా రిలీజ్ అవుతుందని గతంలో అన్నారు. విశాల్ సహాయంతో ** వారు ‘కాలా' చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం సమస్యగా మారినా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.