అమరావతిలో అంబాని! ఏం జరుగుతుంది???

2018-05-14 2

Anil Ambani to meet Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu today.
#Chandrababunaidu
#AnilAmbani
#Amaravati

కేంద్ర సంస్థలకు వివిధ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన భూముల ధరలు తగ్గించాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఉన్నారు. మరోవైపు, ఇతర సంస్థలకు ఇచ్చిన భూములపై కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అడాగ్ అధినేత అనిల్ అంబాని సోమవారం చంద్రబాబును కలవనున్నారు.
నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అడాగ్ గ్రూప్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ అమరావతికి వచ్చి బాబుతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములతో పాటు రాజధానిలో భూములు కేటాయించి, ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇతర సంస్థలకు సీఆర్డీఏ లేఖలు రాస్తోందని తెలుస్తోంది. భూములు కేటాయించి ఇన్ని రోజులు అయినా నిర్మాణాలు ప్రారంభించని విషయాన్ని గుర్తు చేస్తోంది. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అక్కడ భవనాల నిర్మాణం చేపట్టేలా చూడాలని కోరుతోంది.
గత వారం కేబినెట్ ఉప సంఘం సమావేశంలో భూముల కేటాయింపు, నిర్మాణాలపైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్ని సంస్థలకు భూములిచ్చారు, ఎన్ని నిర్మాణాలు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించలేదనే అంశాలపై ఆరా తీశారు. మొత్తం 67 సంస్థల వరకూ ఇంకా ముందుకు రాని విషయం గుర్తించారు. దీంతో భూములు కేటాయించిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ వారికి లేఖలు రాయాలని నిర్ణయించారు.
వారితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమై నిర్మాణాల ఆలస్యానికి కారణాలు తెలుసుకోనున్నారు. ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారో స్పష్టత తీసుకోనున్నారు. ఈ నిర్ణయం తర్వాత కేంద్రం పరిధిలోని ఆర్బీఐ, నాబార్డు, సీపీడబ్ల్యూడీ, హెచ్‌పీసీఎల్, సీఐటీడీ తదితర సంస్థలకు భూముల ధరలు తగ్గనున్నాయి.