IPL 2018: Kohli Will not Play DD VS RCB Match

2018-05-12 661

Virat kohli unwell ahead of royal challengers bangalores must win game against delhi daredevils
#Kohli
#IPL2018
#RoyalChallengersbangalore
#DelhiDaredevils


ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. నాలుగు బెర్త్‌ల కోసం ఏడు జట్లు పోటీ పడుతుండగా.. సన్‌రైజర్స్ ఇప్పటికే నాకౌట్ దశకు చేరుకుంది. మరో విజయంతో చెన్నై కూడా చేరడం ఖాయమే. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం పంజాబ్, ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, బెంగళూరు తలపడుతున్నాయి. నేటి (శనివారం) సాయంత్రం పంజాబ్, కోల్‌కతా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీతో బెంగళూరు తలపడనుంది.
ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్ ఆడనుండగా.. తప్పక గెలవాల్సిన స్థితిలో బెంగళూరు ఉంది. కీలకమై ఈ మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. అతడికి ఒంట్లో బాగోలేదు. దీంతో ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొనలేదు. ఒకవేళ కోహ్లి మ్యాచ్‌కు దూరమైతే.. డివిలియర్స్ జట్టును ముందుకు నడిపే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా పని చేసిన డివిలియర్స్ ఇప్పటి వరకూ ఆర్‌సీబీకి మాత్రం కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఒకవేళ కోహ్లి దూరమైతే మాత్రం దాని ప్రభావం ఆర్‌సీబీ విజయావకాశాలపై తీవ్రంగా ఉండనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లి పది మ్యాచ్‌ల్లో 396 పరుగులు చేశాడు.