Bharath Ane Nenu Movie Latest Collections

2018-05-12 2

Hero Mahesh Babu and Kiara Advani's Bharat Ane Nenu has been creating a sensation at the box office collections. As per the latest trade reports, the film has grossed Rs. 104.25 crores in just 21 days. Still the movie running successful, have to wait how much the film collect.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా తాజాగా విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. సీఎం భరత్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహేశ్ బాబు స్టామినాను మరోసారి నిరూపించడం జరిగింది. తొలి వారాంతంలో భరత్ అనే నేను సినిమా రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు రాబట్టింది.
తాజా కలెక్షన్స్ చూస్తుంటే భరత్ అనే నేను సినిమా రూ.180 కొట్లకు పైగానే గ్రాస్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి సినిమా తర్వాత అంత వేగంగా యూఎస్‌లో ఆ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది భరత్ అనే నేను.
భరత్ అనే నేను సినిమా విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటుగా వసూళ్ల వర్షం కూడా కురుస్తుండటంతో నాన్ బాహుబలి చిత్రాల్లో భరత్ అనే నేను చిత్రం నెంబర్ వన్ గా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . కలెక్షన్స్ ఎంతవరుకు ఆగుతాయో చెప్పడం కష్టం అంటున్నారు జనాలు.
మహేష్ ముఖ్యమంత్రి గా సరికొత్తగా కనిపించడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది . చుసిన సినిమాను మళ్ళీ ధియేటర్ కు వచ్చి చూస్తున్నారు ప్రేక్షకులు. భరత్ అనే నేను సినిమా ఇచ్చిన సక్సెస్ తో మహేష్ బాబు వచ్చే నెల నుండి వంశిపైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.