Rajarajeshwari Nagar election postpone is conspiracy against me said congress MLA and this assembly election congress candidate Munirathna. He said BJP setting me up.
#Rajarajeshwarinagar
#Postpone
#karnatakaAssemblyElections2018
#Siddaramaiah
బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగర (ఆర్ఆర్ నగర) శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసిందని, తన మీద కుట్ర జరుగుతోందని ఆ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న నాయుడు ఆరోపించారు. అమిత్ షా తన మీద కక్షకట్టారని, రూ. 95 లక్షల టీషర్టులకు తనకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఆరోపించారు. ఆర్ఆర్ నగర ఎన్నికల వాయిదా పడిన నేపథ్యంలో మునిత్న నాయుడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద ఆరోపణలు చేశారు.
ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని ఎన్నికల సంఘం నేరుగా తనకే చెప్పి ఉంటే తాను తప్పుకునేవాడినని, నేనుచేయని తప్పుకు ఇలా ఎన్నికలు వాయిదా వేసి తనను మానసికంగా హింసించారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
జాలహళ్ళిలోని అపార్ట్ మెంట్ లో చిక్కిన ఓటరు ఐడీ కార్డులు నకిలీవికాదని స్వయంగా ఎన్నికల సంఘం చెప్పిందని మునిరత్న నాయుడు అన్నారు. ఓటరు ఐడీ కార్డులు చిక్కన అపార్ట్ మెంట్ ఉన్న ప్రాంతం కార్పొరేటర్ బీజేపీ మనిషి, అపార్ట్ మెంట్ యజమాని బీజేపీ మనిషి, కేవలం అక్కడ తన కరపత్రం చిక్కిందని ఎన్నికలు వాయిదా వేయడం విడ్డూరంగా ఉందని మునిరత్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన మీద వ్యక్తిగతంగా కక్షకట్టారని, రెండుసార్లు తన నియోజక వర్గానికి ఆయన వచ్చారని, తాను విజయం సాధిస్తానని పసిగట్టిన ఆయన ఎన్నికలు వాయిదా వేయించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.