Mehbooba Movie Review మెహబూబా మూవీ రివ్యూ

2018-05-11 8

Tollywood's popular director Puri Jagannadh launching his son Akash Puri with Mehbooba movie. This movie is set to release on May 11. This made under banner of Puri Connect. In this occassion Akash puri speaks to media.
#Mehbooba
#Tollywood


దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించే విలక్షణ దర్శకుడు పూరీని ఈ మధ్యకాలంలో సక్సెస్‌లు పలకరించిన దాఖలాలు చాలా తక్కువే. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా, నేహా శర్మ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా.ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కి సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రోషన్ ( ఆకాష్ పూరీ) అమితమైన దేశభక్తి కలిగిన యువకుడు. సైన్యంలో చేరాలనే తపనతో ఉంటాడు. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేయడమంటే చాలా ఇష్టం. కానీ చిన్నతనం నుంచే కొన్ని జ్ఞాపకాలు రోషన్‌ను వెంటాడుతుంటాయి. హిమాలయాలతో తనకు అవినాభావ సంబంధం ఉందనే భావనతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన పాకిస్ఠానీ అమ్మాయి అఫ్రీన్ (నేహా శెట్టి) పరిచయం అవుతుంది. ఓ సందర్భంలో ఆఫ్రీన్‌‌ను రక్షిస్తాడు. ఆ తర్వాత ఏదో చెప్పలేని బంధం తమ మధ్య ఉందనే ఫీలింగ్ ఇద్దరిలోనూ ఏర్పడుతుంది. ఈ క్రమంలో హియాలయాలకు వెళ్లిన రోషన్‌కు ఆఫ్రీన్ రూపంలో ఉన్న ఓ అమ్మాయి శవం మంచు కొండల్లో లభ్యమవుతుంది. అప్పుడు ఆఫ్రీన్‌ డైరీలో లభ్యమైన సమాచారం ఆధారంగా తమది గత జన్మ బంధమని తెలుసుకొంటాడు.
మెహబూబా చిత్ర ప్రథమార్థంలో రోషన్, ఆఫ్రీన్ గత జన్మ జ్ఞాపకాలతో కథ మొదలవుతుంది. రోషన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, చదువు కోసం ఆఫ్రీన్ హైదరాబాద్‌కు రావడం అనే అంశాలతో చకచకా సాగిపోతుంది. పాకిస్థాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ సందర్బంగా వచ్చే సన్నివేశాలలో పూరీ మార్కు కనిపిస్తుంది. పూరీ మార్కు డైలాగ్స్‌తో జోష్ కూడా కనిపిస్తుంది. ఆఫ్రీన్‌ను దుండగుల దాడిని నుంచి కాపాడే సీన్లు పూరీ స్టయిల్‌ను గుర్తు చేస్తాయి. రోషన్ కోసం ఆఫ్రీన్ వెతుకులాటలో ఎమోషన్ కనిపిస్తుంది. తనకు వెంటాడే మెమోరీస్‌ను ఛేదించే క్రమంలో రోషన్ ఆవేదన ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఆసక్తికరమైన మలుపుతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.