A desperate Delhi Daredevils will have to learn from the mistakes made in the previous game against table-toppers Sunrisers Hyderabad when the two sides with contrasting campaigns meet in a re-match of the Indian Premier League, here on Thursday (May 10).
#IPL2018
#Delhidaredevils
#Sunrisershyderabad
#ShreyasIyer
ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటి వరకూ 11మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 9 విజయాలతో హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ చేరుకున్న తొలి జట్టుగా ఘనతను నమోదు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. బదులుగా హైదరాబాద్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది.
సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురు దాడికి రిషబ్ పంత్ (128 నాటౌట్) అజేయ సెంచరీతో ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభంలోనే ఓపెనర్ హేల్స్ వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ (83) శిఖర్ ధావన్ (92)లు కలిసి జట్టుకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యుత్తమ పార్టనర్‌షిప్ కాగా, సన్‌రైజర్స్ తరఫున అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం విశేషం.
2014లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 186 పరుగులు చేసి గెలవడమే ఛేజింగ్‌లో హైదరాబాద్‌కు అత్యధికం.
సన్‌రైజర్స్ నెలకొల్పిన నాలుగు అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ధావన్ పాత్ర ఉండటం విశేషం.
సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పార్టనర్‌షిప్ నెలకొల్పిన (176) ధావన్-విలియమ్సన్ జోడి. వార్నర్-ధావన్ జోడి గతేడాది కోల్‌కతా మీద 139 పరుగులు జోడించారు. అంతకు ముం దే ఏడాది గుజరాత్‌పై వీరిద్దరూ 137 జోడించారు. 2017లో ధావన్-విలియమ్సన్ జోడి ఢిల్లీపైనే 136 పరుగులు జోడించడం గమనార్హం.