Bharatiya janatha Party National President Amit Shah on Friday faced bitter experience with tdp cadre in Tirumala.
#Amitshah
#BJP
#Andhrapradesh
#SpecialStatus
#TDP
కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైంది.
అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్ షా రాకను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలను ప్రదర్శించారు. 'అమిత్ షా గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అప్పటికే భారీగా పోలీసులు మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ మోసం చేసిందని, తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కిందని.. ఇప్పుడు మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకొచ్చారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
అమిత్ షా కాన్వానయ్‌ను అట్టుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా.. అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దాలు పగలగొట్టడంతో బీజేపీ శ్రేణులు టీడీపీ శ్రేణులతో ఘర్షణకు దిగాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అమిత్ షా కాన్వాయ్ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఎంపీపై దాడి దిగడం ఏంటని బీజేపీ నేత భాను ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.