Mahanati Team Gets Compliments From Director Krish

2018-05-10 448

Savithri biopic Mahanati Teaser released. Actress Keerthy suresh is steps into Savithri's role. Samantha prabhu, Vijay Deverakonda, Director Krish are played key roles in this movie. This movie is slated to release on May 9th. In this occassion, Director Krish expressed his happyness on his role and praised the other actors, who are part of the film.
#mahanati
#keerthysuresh
#samanthaprabhu

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు కేవీరెడ్డి పాత్రలో డైరెక్టర్ క్రిష్ నటించారు. క్రిష్ పోషించిన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ నేపథ్యంలో మహానటి చిత్రంపై, చిత్ర యూనిట్‌ గురించి ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో అలరించారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే..
మహానటి చిత్రాన్ని చూస్తున్నంత సేపు అద్భుతమైన భావోద్వేగానికి గురయ్యాను. ఆ ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు రావడం లేదు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించడానికి దర్శకుడు నాగ అశ్విన్ ఎంత శ్రమపడ్డారో ఊహకు అందని విషయం. అద్భుతమైన విజన్‌తో సినిమాటోగ్రాఫర్ డానీ తెరపైన దృశ్యకావ్యంగా మలిచారు. వారందరిపై అచెంచలమైన గౌరవం కలుగుతున్నది.
మహానటి చిత్రంలో కీర్తీ సురేష్ అద్భుతమైన భావోద్వేగాలను తన నటనతో పలికించారు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన ఆమెకు హ్యాట్సాఫ్. ఓ సూపర్‌స్టార్ విషాదకరమైన కథలో ఓ యువనటి చక్కగా ఒదిగిపోయింది. అద్భుతమైన నటనను ఇంతగా ప్రదర్శించిన ఓ హీరోయిన్‌ ఇప్పటివరకు చూడలేదని చెప్పడానికి నేను సంకోచించను అని క్రిష్ ట్వీట్ చేశారు.
మహానటి లాంటి గొప్ప చిత్రంలో సానుభూతి, ద్వేషం కలిగి ఉన్న జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్‌కు తలవంచి నమస్కరిస్తున్నాను. ఆయన ప్రదర్శించిన నటనకు ముగ్దుడినయ్యాను. ప్రతికూల ప్రభావం చూపే జెమినీ పాత్రను చేసి మెప్పించాడు. నటనలో ఉత్తమ ప్రమాణాలను చాటిచెప్పాడు. కంగ్రాట్స్ దుల్కర్ అని క్రిష్ మరో ట్విట్ చేశారు.