IPL 2018: Ishan Kishan Hits Like Dhoni's Helicopter Shot

2018-05-10 66

Mumbai Indians produced a brilliant bowling and fielding performance after Ishan Kishan's batting pyrotechnics as they thrashed Kolkata Knight Riders by 102 runs to keep themselves in the hunt for a play-offs berth in the Indian Premier League.
#IPL2018
#Mumbaiindians
#Kolkataknightriders
#Dhoni

ఐపీఎల్‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లపై విరుచుకుపడిన ముంబై ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ మెరిసింది. జట్టు విజయం కంటే అతని ఆటతీరే అందరికీ చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కొట్టిన ఓ షాట్‌ అద్భుతంగా అలరించింది. అంతేగాక ప్రముఖ మీడియా ఛానెళ్లన్నీ ఆ షాట్ అచ్చు మహేంద్రసింగ్ ధోనీ హెలికాప్టర్ షాట్‌ను పోలి ఉందంటూ కితాబులిస్తున్నారు.
టోర్నీలో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14వ ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఓ బంతిని జార్థండ్ ఆటగాడైన ఇషాన్‌ సిక్స్‌గా మలిచాడు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ ఎలా ఆడతాడో అచ్చు అలాగే ఇషాన్‌ ఈ సిక్స్‌ బాది చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
'ధోనీ సలహాలు ఇషాన్‌కు బాగా ఉపయోగపడ్డాయి; ధోనీలా హెలికాప్టర్‌ షాట్‌ కొట్టాడు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌... ధోనీ వద్ద సలహాలు తీసుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కేవలం 21 బంతుల్లోనే 62 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముంబయి 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిన 11 మ్యాచుల్లో 5 విజయాలతో ముంబయి ఇండియన్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.