The audio launch of Superstar Rajinikanth’s Kaala is being held in Chennai. The event at Chennai’s YMCA ground is the first big event of the season post the strike. The Kaala music album has been composed by Santhosh Narayanan.
#kaalaAudioLaunch
#Rajinikanth
#dhanush
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' మూవీ ఆడియో వేడుక చెన్నైలో బుధవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.చాలా కాలం తర్వాత ఈ సారి 'కాలా' ఆడియో వేడుక భారీ ఎత్తున నిర్వహించారు ఈ చిత్ర నిర్మాత ధనుష్. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో అభిమానుల ఉద్దేశించి రజనీకాంత్ సుధీర్ఘ ప్రసంగం ఇచ్చారు.
ఇపుడు నా వయసు 65 సంవత్సరాలు. ఈ సమయంలో నాకంటే సగం వయసు ఉన్న అమ్మాయిలతో నేను రొమాన్స్ చేయకూడదు. అందుకే ‘కాలా' సినిమాలో అలాంటివి చేయలేదు... అని రజనీకాంత్ తెలిపారు.
చాలా కాలం క్రితమే రజనీ పని అయిపోయిందని కొంత మంది అన్నారు. కానీ వారు 40 ఏళ్లుగా ఆ విషయం చెబుతూనే ఉన్నారు. ఆ దేవుడి దయ, అభిమానుల ఆశీర్వాదంతో ఇంకా పరుగెడుతూనే ఉన్నాను.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను చేయాలనుకున్నది చేస్తూనే వెళుతున్నాను. వయసుకు తగిన పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. అపుడే రంజిత్ పరిచయం అయ్యాడు. కబాలి సినిమా చేశాను అని తెలిపారు.