ఢిల్లీలో ఇసుక తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరిక

2018-05-09 126

The weather department has forecast a spell of rain/thunderstorm, accompanied with squall, in the national capital late in the evening on Monday. It said the wind speed might go up to 50-70 kilometers per hour.
#DustStorm
#Delhi
#Climate

వాతావరణంలో అనుహ్య మార్పులు ఉత్తరభారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ వాసులను దుమ్ము తుఫాన్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.
సోమవారం రాత్రి పూట డిల్లీని దుమ్ము తుఫాన్ కమ్మేసింది. సుమారు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విపరీతమైన దుమ్ము, ధూళి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది.
ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొందని అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుండి బయలుదేరాల్సిన ఆరు విమానాలు ఆలస్యంగా బయలు దేరాయి దీనికి తోడు భారీ వర్షాలు కూడ కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను సంభవించింది. త్రిపురలో భారీ వర్షాలకు వెయ్యి ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఓ మహిళ కూడ చనిపోయింది.
జమ్ముకశ్మీర్‌, హర్యానా, చండీగఢ్‌, పశ్చిమ్‌బంగ, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళ, సిక్కిం రాష్ట్రాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర భారతదేశంలో గాలివాన బీభత్సానికి ఐదు రాష్ట్రాల్లో 124 మంది మృతిచెందగా, 300 మంది గాయపడ్డారు.