K Raghavendra rao review about Mahanati. Mahanati is a biographical period film based on the life of South Indian actress Savitri. The film is produced by C. Ashwini Dutt, Swapna Dutt, Priyanka Dutt on Vyjayanthi Movies & Swapna Cinema banner and directed by Nag Aswin. It stars Keerthy Suresh in the titular role, Dulquer Salmaan, Samantha Akkineni, Vijay Devarakonda in other pivotal roles and music composed by Mickey J. Meyer.
#Mahanati
#savitri
#ntr
#keerthysuresh
సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. సినీ ప్రముఖులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 'మహానటి' చూసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
"సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమా వైజయంతి మూవీస్ కి ధన్యవాదాలు . సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది. శివాజీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటన అద్భుతం. నాగ అశ్విన్ మరియు చిత్ర యూనిట్ కి నా అభినందనలు.... అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం. అపుడు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా విడుదలైంది. చాలా పెద్ద సినిమా తీసాము అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అనే ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైందని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.
మా దత్తు గారికి ఆరోజు ఎంత ఆనందం వేసిందో ఇప్పటికి మర్చిపోలేదు. సరిగ్గా 28 ఏళ్ల తర్వాత ఇదే రోజున ‘మహానటి' విడుదలయింది. ఆరోజున జగదేక వీరుడు అతిలోకసుందరి నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు మహానటి నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి.... అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.