Mahanati Premier Show Talk

2018-05-09 3,640

Mahanati Premier Shows Reviews..Mahanati Movie Is The life story of South Indian actress Savitri, who took the film industry by storm in the late '50s and '60s.
లెజెండ్రీ నటి, తొలి లేడీ సూపర్ స్టార్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం మహానటి. విడుదలకు ముందే ఈ చిత్రం తెలుగువారందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం సావిత్రి నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేయడమే. ఆమెలా నటించడం, హావభావాలు పలికించడం సావిత్రికి మాత్రమే సాధ్యమైన అంశాలు. దిగ్గజ నటి జీవిత చరిత్రని తెరకెక్కించాలనే ఆలోచన చేసిన దర్శకుడు నాగ అశ్విన్ సావిత్రి జీవితం గురించి క్షుణ్ణమైన అధ్యయనం చేసి మహానటి కథ రూపొందించారు.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో వీరి మధ్య కెమిస్ట్రీ కన్నుల పండుగలా ఉంది.
సావిత్రి జీవితాన్ని అధ్యయనం చేసే జర్నలిస్టు మధురవాణిగా సమంత నటించింది. ఫొటోగ్రాఫర్ గా విజయ దేవర కొండ కనిపించాడు.