Table toppers Sunrisers Hyderabad produced yet another spirited bowling effort after skipper Kane Williamson's crucial half-century to beat Royal Challengers Bangalore by five runs and virtually assure themselves a place in the playoffs of the Indian Premier League on Monday.
#IPL2018
#RoyalChallengersBangalore
#Kohli
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్-బెంగళూరు జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సూపర్ స్టార్ ఆటగాళ్లకు కొదవ లేదు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. ఉదాహరణకు అప్పట్లో అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్... ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్. అయినా సరే గత పదేళ్ల సీజన్‌లో అర్‌సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.
ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ప్లేఆప్స్‌కు దూరం కావడంతో ఈ సీజన్‌లో టైటిల్ రేసు నుంచి తప్పుకుంది. అయితే గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించి... ప్రస్తుతం ఇతర జట్ల తరుపున ఆడుతున్న ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం.
టీమిండియా ప్రధాన పేసర్‌గా వెలుగొందుతున్న భువనేశ్వర్ కుమార్ 2009, 2010 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2009లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన భువీ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే, పూణె వారియర్స్ తరుపున 2011లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది 2012లో భారత్ తరుపున అరంగేట్రం చేశాడు. కాగా, ఐపీఎల్‌లో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ టోర్నీలో తొలి సెంచరీ సాధించిన ఆటగాడు మనీష్ పాండే. 2009లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన పాండే సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో పూణె వారియర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరుపున మిడిలార్డర్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరుగాంచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 24 గేమ్స్ ఆడిన పాండే 31.61 యావరేజితో 569 పరుగులు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు.