"Chiranjeevi not only thinks about his role. He will also consider the role of others in movie. Those are Reason Behind Chiranjeevi Becoming Megastar" Kodi Ramakrishna said. Kodi Ramakrishna is an Indian film director and writer known for his works predominantly in Telugu cinema, and a few Tamil, Malayalam and Hindi films.
#Chiranjeevi
#KodiRamakrishna
నిన్నటితరం తెలుగు దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వ్యక్తి కోడి రామకృష్ణ. చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోడి రామకృష్ణ.... చిరంజీవి గురించి, ఆయన కథలు ఎంచుకునే తీరు ఎలా ఉంటుంది? ఈ రోజు మెగాస్టార్‌గా ఎదగడం వెనక కారణాలు ఏమిటి? అనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
చిరంజీవిలో ఉండే నేచర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన పట్టుదల ఉన్న మనిషి. బాగా యాక్ట్ చేయాలి, ఏదైనా సాధించాలి అని యాంబిషన్ ఉన్న మనిషి. అందుకే నా తొలి సినిమా కథ నిర్మాత రాఘవకు చెప్పగానే ఎవరు హీరో? అన్నారు. చిరంజీవిని అనుకుంటున్నానండీ, ఆయన అయితేనే నా కథకు సరిపోతారండీ అని చెప్పాను... అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.
ఎందుకు నా హీరోను కాదని చిరంజీవిని అనుకుంటున్నావు అని ఆ మీటింగులో నన్ను అడిగారు. ‘నా సినిమా భార్య భర్తను అనుమానించడం, అవమానించడం. అది మీరు చెప్పిన హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే అందరు ఆడోళ్లు థ్రిల్ అవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఏంటీ ఈ అమ్మాయి ఇలా చేస్తుందనే ఒక ఫీలింగుకు వస్తారు. అన్ని జనరేషన్లకు నచ్చిన స్టార్ చిరంజీవి. అప్పట్లో ఆయన పెద్ద స్టార్ కాదు...ఆయనకు ఉన్న టాలెంట్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను చూసి ఆడవారు ఎందుకు ఇంత గొప్పవాన్ని అనుమానిస్తుంది? అనే ఫీలింగ్ వచ్చి సినిమా స్పాన్ పెరుగుతుందని చెప్పాను. దానికి నిర్మాత రాఘవ కన్విన్స్ అయి ఓకే చెప్పారు అని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు