Mahanati Movie Characters : Shalini Pandey Character

2018-05-08 2

Here is the Character Intro of Shalini Pandey as Susheela in Mahanati. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
#Mahanati
#ShaliniPandey

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్ర ఏమిటి? అనే వివరాలు ఇంత వరకు బయటకు రాలేదు. తాజాగా ఈ పాత్రను హీరో నాని వాయిస్ ఓవర్‌ ద్వారా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేశారు.
'మహానటి'లో శాలిని పాండే ... సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల పాత్రలో కనిపించబోతోందట. ''సుశీల... సావిత్రి గారి చిన్ననాటి స్నేహితురాలు. బాల్యంలో బలపడిన బంధం కదా...ఇద్దరూ రాళ్లలో రాగాలు తీశారు, రాధాకృష్ణులుగానూ అలరించారు. మరి మనకు తెలియని సుశీలను మన మనసుకు పరిచయం చేయబోతోంది 'మహానటి'... అంటూ రిలీజైన వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది.