Mahanati Characters Reveal : Malavika Nair's Character

2018-05-08 1

Here is the Character Intro of Malavika Nair as Alamelu in #Mahanati. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
#Mahanati
#MalavikaNair

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'లో హీరోయిన్ మాళవిక నాయర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'‍‌లో హీరోయిన్‌గా చేసిన మాళవిక‌ను ఇపుడు 'మహానటి'లో ఓ ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశాడు నాగ్ అశ్విన్. ఇందులో ఆమె జెమినీ గణేశన్ మొదటి భార్య, సావిత్రి సవితి పాత్ర 'అలిమేలు'గా కనిపించబోతోంది. నాని వాయిస్ ఓవర్‌ ద్వారా ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఓ ఇంట్రో వీడియో విడుదల చేశారు.
అలిమేలు, జెమినీ గణేశన్ మొదటి భార్య. సావిత్రికి అక్కలా ఆప్యాయతను పంచడమే కాకుండా, తన కూతురికి తల్లిలా కన్యాదానం చేసిన మేటి ఇల్లాలు. ఈ పాత్రలో ఒదిగిపోయింది మన మాళవిక నాయర్..... అంటూ నాని వాయిస్ ఓవర్‌తో ఇంట్రో వీడియో విడుదల చేశారు.