Telugu director Nag Ashwin's biopic of actress Savitri, is attempting a cradle to grave account of the South Indian screen legend. The soundtrack for the May 9 release comprises five songs, each of which corresponds to a phase in the actress's tumultuous life. Music by Mickey J Meyer. Avasarala srinivas and krish playing important roles in this film.
#mahanati
#Savitri
#keerthy suresh
#samantha
'మహానటి' కథలో ముఖ్యమైన ఇతర పాత్రల కోసం కూడ పాపులర్ వ్యక్తుల్నే ఎంచుకున్నారు. సావిత్రిగారి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగారి సినీ జీవితంలో ముఖ్యులైన ప్రతి ఒక్కరిని సినిమాలో చూపించనున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు భారతీయ చలన చిత్ర చరిత్రకే మకుటాయమానం. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా పోషించగల నటుడు. సావిత్రికి ఎస్వీఆర్ మధ్య అత్యద్భుత స్నేహ సంబంధాలున్నాయి. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి సినిమాలో మోహన్ బాబు ఎస్వీ ఆర్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మోహన్ బాబు ఎస్విఆర్ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నాడు.
మహానటి సినిమాలో ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి పాత్రలు ఎవరు చేస్తున్నారనే అనుమానాలు ఉండేవి, కాని తాజాగా చిత్ర యూనిట్ ఈ పాత్రలు ఎవరు చేస్తున్నారనేది పోస్టర్స్ ద్వారా తెలిపింది. ఆ పాత్రల్లో నటించే నటులను రివీల్ చేశారు. ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, కేవీ రెడ్డిగా దర్శకుడు క్రిష్ నటిస్తుండడం విశేషం.
‘మహానటి' కథలో ముఖ్యమైన ఇతర పాత్రల కోసం కూడ పాపులర్ వ్యక్తుల్నే ఎంచుకున్నారు. ముఖ్యంగా.. మోహన్ బాబు, అవసరాల శ్రీనివాస్, క్రిష్ పాత్రలు హైలైట్ కాబోతున్నాయని సమాచారం. సావిత్రిగారి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రిగారి సినీ జీవితంలో ముఖ్యులైన ప్రతి ఒక్కరిని సినిమాలో చూపించనున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.