Naa Peru Surya Moive Review నా పేరు సూర్య సినిమా రివ్యూ

2018-05-04 6

Directed by Vakkantham Vamsi, Naa Peru Surya pre-release business has crossed Rs 100 Cr mark. While worldwide theatrical rights alone valued 85.87 Cr, satellite and digital rights fetched its producers 25 Cr.

సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్‌లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథా, మాటల రచయిత వక్కంత వంశీ తొలిసారి దర్శకుడిగా మారారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ స్టార్‌ను యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా ఆవిష్కరించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన నా పేరు సూర్య.. అల్లు అర్జున్‌కు మరో సక్సెస్‌ను అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
భారత సైన్యంలో సూర్య (అల్లు అర్జున్) ఓ సైనికుడు. సమాజంలో ఎవరైనా చిన్న తప్పు చేసినా సహించని వ్యక్తిత్వం. కోపమే అతనికి ఆయుధం. దేశ సరిహద్దులో విధులు నిర్వహించాలనే ఓ కోరిక ఉంటుంది. కానీ ఓ కారణంగా సైన్యం నుంచి సూర్యను కల్నల్ (బోమన్ ఇరానీ) బయటకు పంపిస్తారు. అయితే సూర్యలో ఉన్న మంచి తనాన్ని చూసి ఓ మరో ఛాన్స్ ఇవ్వమని కల్నల్‌కు తన గాడ్ ఫాదర్ (రావు రమేష్) కోరుతాడు. దాంతో కన్విన్స్ అయిన కల్నల్ సూర్యకు అవకాశం ఇస్తాడు. కానీ వైజాగ్‌లో ఉన్న మానసిక వైద్యుడు రామక‌ృష్ణంరాజు (అర్జున్) సంతకం తీసుకొస్తే మళ్లీ సైన్యంలో చేర్చుకొంటానని సూర్యకు ఓ షరతు విధిస్తాడు. అంతేకాకుండా తన కోపం తగ్గించుకోవడానికి 21 రోజుల గడువు విధిస్తాడు.
రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య 21 రోజుల అతడి నుంచి సంతకం తీసుకొన్నాడా? సూర్య జీవితంలో తన ప్రేయసి వర్ష (అను ఇమ్మాన్యుయేల్) పాత్ర ఏమిటి? సూర్య, జ్యోతి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది? 21 రోజుల్లో తన కోపాన్ని తగ్గించుకొన్నాడా? రామకృష్ణంరాజుకు సూర్యకు ఉన్న రిలేషన్ ఏమిటీ? రామకృష్ణంరాజుకు సూర్య ఎందుకు దూరమయ్యాడు? రావు రమేష్ ఎందుకు గాడ్‌ఫాదర్‌గా మారాడు? 21 రోజుల్లో సూర్యకు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా పేరు సూర్య చిత్ర కథ.
తొలి భాగంలో ఎక్కువ భాగం సూర్య క్యారెక్టరైజేషన్‌కే ప్రాముఖ్యత ఇచ్చారు. సూర్య పాత్రను డిజైన్ చేసిన విధానం చక్కగా ఆకట్టుకొంటుంది. ప్రధానంగా కొపిష్టి అయిన సూర్య దేశం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే అనే అంశం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఫైట్స్, ఎమోషన్ సీన్లు ఫస్టాఫ్‌కు బలంగా మారాయి. ఇక తండ్రి రాఘురామకృష్టంరాజు, సూర్య మధ్య సాగే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు సినిమాను మరోస్థాయికి చేర్చాయి. కాకపోతే కథా గమనం కాస్త నెమ్మదించడం ప్రేక్షకుడిని ఇబ్బందికి గురిచేస్తాయి.