A man from Lucknow, who was already married nine times and got engaged to another woman here without informing about his previous marriages, has been arrested by the police. The fraudster was arrested by the Thakurganj police after his seventh wife filed a police complaint.
ఒకరికి తెలియకుండా మరొకరితో తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఎట్టకేలకు ఏడో భార్యకు దొరికిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తికి ఏడాది క్రితం లక్నోకు చెందిన అప్షా అనే యువతితో వివాహం జరిగింది. అయితే, ఆమెను ఎప్పుడూ ‘నువ్వు నా ఏడో భార్యవు' అంటూ సమీర్ ఆటపట్టిస్తుండేవాడు. అఫ్షా కూడా తన భర్త ఏదో సరదాగా అంటున్నాడని అనుకునేది.
కాగా, నేహా అనే యువతి తన భర్తకు తరచూ ఫోన్లు చేస్తుండటంతో అఫ్షాకు అనుమానం వచ్చింది. అతను ఫోన్ కూడా చూడటానికి ఒప్పుకోకపోవడంతో అఫ్షా అనుమానం మరింత బలపడింది.
ఈ క్రమంలో ఓసారి సమీర్‌కు తెలియకుండా తన ఫోనులో నేహా నెంబరు తీసుకుని ఫోన్ చేసి ఆరా తీసింది. తాను సమీర్ భార్యను అని చెప్పేసరికి నేహా చెప్పడంతో అఫ్షాకు దిగ్భ్రాంతికి గురైంది.
#Lucknow
#Thakurganjpolice
# wifecomplaint