Bahubali Had Huge Collections in china To

2018-05-03 1,023

Prabhas‘ Baahubali 2: The Conclusion will be released in 7000 plus screens across the China country. Trade analyst and industry tracker – Ramesh Bala also confirmed this piece on information, as he posted on Twitter, “#Baahubali2 to open in 7,000+ Screens in #China on May 4th.”
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది కంక్లూజన్' ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ముఖ్యమైన సినిమాగా నిలిచిపోయింది. ఫిల్మ్ మేకింగ్‌లో సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడమే కాకుండా... భారతీయ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ఇటు దేశీయ బాక్సాఫీసు వద్ద, అటు ఓవర్సీస్ బక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు నమోదు చేసింది.
ఈ సెన్సేషనల్ చిత్రం ఇప్పటి వరకు ఇండియాతో పాటు చాలా దేశాల్లో విడుదలైంది కానీ... చైనాలో విడుదల కాలేదు. ఎట్టకేలకు మే 4న చైనాలో విడుదల చేస్తున్నారు. ఈ మూవీపై చైనాలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఎగ్జిబిటర్లు దీన్ని ఆ దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 7000 పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నారట. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
7000 ప్లస్ స్క్రీన్లలో విడుదల కావడం ద్వారా రిలీజ్ విషయంలో ‘దంగల్' రికార్డును బాహుబలి-2 బీట్ చేసినట్లయింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ మూవీ ‘బజరంగీ భాయిజాన్' చైనాలో 8000పైగా స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమా తర్వాత చైనాలో అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న చిత్రం ‘బాహుబలి-2' మాత్రమే

# Baahubali 2
# China

Free Traffic Exchange