Bharath Ane Nenu Continues Its Collections In USA

2018-05-03 3


Dis:Mahesh Babu's Bharat Ane Nenu (BAN) has continued its success streak at the US box office in the second week. The movie has collected approximately $440,463 at the US box office in five days of its second week and its 12-day total collection has reached $3,230,282 in the country.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సెకండ్ వీక్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక్కడ విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మూవీ ఆల్రెడీ 'రంగస్థలం' లైఫ్ టైమ్ రికార్డుకు చేరువైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రికార్డును అందుకోవడం అంత సులభం కాదని అంటున్నారు. మరి మహేష్ బాబు మూవీ ఆ రికార్డును అధిగమించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందని అంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
భరత్ అనే నేను చిత్రం తొలి వారం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $2,789,819 వసూలు చేసింది. ఈ మధ్య పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సెకండ్ వీక్‌లోనూ 193 స్క్రీన్లలో ప్రదర్శించే చాన్స్ దక్కింది. దీంతో 9 రోజుల్లోనే $3 మిలియన్ మార్కను అందుకుంది.
తొలివారం భారీ వసూళ్లు రాబట్టి సెకండ్ వీక్‌లో ఎంటరైన భరత్.... రెండో వారం తొలి 5 రోజుల్లో $440,463 వసూలు చేసింది. దీంతో 12 డేస్ (7+5) టోటల్ కలెక్షన్ $3,230,282 మార్కును అందుకుంది. సెకండ్ వీక్‌లో రోజువారీ కలెక్షన్లు పరిశీలిస్తే శుక్రవారం $106,707, శనివారం $156,032, ఆదివారం $97,520, సోమవారం $41,933, మంగళవారం $38,271 వసూలు చేసింది.
#Bharat Ane Nenu
#Mahesh Babu
#Rangasthalam