Rumors on Raviteja Nela Ticket movie. Movie unit gives clarity
రవితేజనటిస్తున్న తాజా చిత్రం నేల టికెట్టు. రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న మరో వినోదభరిత చిత్రం ఇది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ చిత్ర ఆడియో వేడుక జరగబోతోంది. ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతాడని ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల చల్ చేశాయి. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించింది. నేల టికెట్టు ఆడియో వేడుక విషయంలో వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని చిత్ర యూనిట్ ప్రకటించింది. రూమర్స్ నమ్మవద్దని అభిమానులని చిత్రయూనిట్ కోరడం విశేషం. ఆడియో వేడుకకు హాజరయ్యో చీఫ్ గెస్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
చిత్ర యూనిట్ ప్రకటనతో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నాడే వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోయాయి. పవన్ కళ్యాణ్ రవితేజ సినిమా ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ అనే వార్తలు రాగానే సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున హంగామా చేసారు
#Pawankalyan
#Raviteja
#NelaTicket