కాలేజ్ అమ్మాయితో రాసలీలలు, లేడీ ప్రొఫెసర్ అరెస్ట్

2018-04-28 727

Former IAS officer Santhanam and a team of CBCID officials are probing Nirmala Devi case. Based on the outcome of the investigation, strict action will be taken against professors and others involved in the scandal.

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ విద్యార్థినులను లైంగిక ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ అరెస్టు అయిన లేడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మాజీ ఐఏఎస్ అధికారి సంతానం ఏకసభ్య కమిషన్ విచారణ చేసి వివరాలు సేకరించింది.
మాజీ ఐఏఎస్ అధికారి సంతానం మదురై సెంట్రల్‌జైలుకు వెళ్లి నిర్మలా దేవిని విచారణ జరిపారు. కాలేజ్ అమ్మాయిలను ఎందుకు లైంగిక ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నించారు, అమ్మాయిలతో లైంగిక కోరికలు తీర్చుకోవడం కోసం అధికారులు ఎవరెవరు మిమ్మల్ని సంప్రధించారు అని ప్రశ్నించారని తెలిసింది.
మదురై కామరాజర్ యూనివర్శిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ తో పాటు కాలేజ్ అమ్మాయిలను సరఫరా చెయ్యాలని నిర్మలా దేవిని అడిగిన వారి గురించి మాజీ ఐఏఎస్ అధికారి సంతానం పూర్తి వివరాలు అడిగారని తెలిసింది. సంతానంతో పాటు ప్రొఫెసర్లు త్యాగేశ్వరి, కమలి తదితరులు నిర్మలా దేవిని దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు.
తూత్తుకూడికి చెందిన మహిళా కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జెసింత తమిళమలర్ కు సీబీసీఐడి అధికారులు సమన్లు జారీ చేశారు. రెండోసారి సమన్లు అందుకున్నఅసిస్టెంట్ ప్రొఫెసర్‌ జెసింత తమిళమలర్ అధికారుల ముందు విచారణకు రెండో సారి హాజరైనారు.
#Officer
#Santhanam
#CBCID
#Nirmala Devi
#College Students