Bharath Ane Nenu Overseas Collections

2018-04-28 212

Superstar Mahesh Babu's latest sensation Bharat Ane Nenu, directed by Koratala Siva set a new record by touching $4 million mark overseas (USA, Australia, Europe Gulf and other areas included) by end of its first week

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి వారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా భరత్ అనే నేను ఓవర్సీస్ మార్కెట్లో సరికొత్త మార్కును అందుకుంది. యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకె, గల్ఫ్, ఇతర ఏరియాల్లో కలిపి తొలివారం $4 మిలియన్ పైగా వసూలు చేసింది. ఒక్క యూఎస్ఏలోనే 3 మిలియన్ వసూలు చేసింది.
ఈ చిత్రం నార్త్ అమెరికాలో $3015K, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో $535k, యూరఫ్-యూకెలో కలిపి $350K, ఆఫ్రికా, మలేషియా, సింగపూర్‌లో $150K, గల్ఫ్ రీజియన్లో $600K వసూలు చేసింది. ఇప్పటి వరకు ఓవరాల్‌గా $4.65 మిలియన్(రూ. 31.06) వసూలు చేసింది. ఓవరాల్ రన్‌లో ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 5 మిలియన్ డాలర్ మార్క్ అందకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు.
#Bharat Ane Nenu
#Koratala Siva
# Mahesh Babu